పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం

Must read

పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం

ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

జీ న్యూస్ బైంసా

బైంసా పట్టణం లోని పదవ తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. బైంసా పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ఏపీ నగర్), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(కిసాన్ గల్లీ),  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం,ఆశ్రమ పాఠశాల,మైనారిటీ గురుకులం, మహాత్మా జ్యోతి బాపులే పాఠశాల, శ్రీ సరస్వతి శిశు మందిర్ (కిసాన్ గల్లీ) పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రవేట్ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ తరుపున ట్రస్ట్ ఛైర్మెన్ మోహన్ రావ్ పటేల్  స్టడీ మెటీరియల్ (అల్ ఇన్ వన్) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ..నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయిస్తూ విజయం సాధించాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. చదివేమెళకువలు,అనుసరించల్సిన విధానంపై వివరించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.విద్యార్థులు పాఠశాల అధ్యాపకులు మోహన్ రావ్ పటేల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,పాఠశాల అధ్యాపకులు,ట్రస్ట్ టీం సభ్యులు, బైంసా టౌన్ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

More articles

Latest article