కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు-

Must read

కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు-

పలు పంచాయతీల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కొత్త సర్పంచులు…-

లోకేశ్వరంలో గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన సర్పంచ్…

 

జీ న్యూస్  లోకేశ్వరం:

లోకేశ్వరం మండలంలో సోమవారం కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. ఆయా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నుండి గెలుపొందిన సర్పంచులు పదవి బాధ్యతలు స్వీకరించారు. మండలంలో 25 గ్రామపంచాయతీలు ఉండగా, నూతనంగా ఎన్నికైన సర్పంచులు,ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.

నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన పలువురు కొత్త సర్పంచులు…

పాలనలో ప్రత్యేకతను చాటేందుకు ఇరువురు సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసిన రోజే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. లోకేశ్వరం సర్పంచ్ ధార్వాడి కపిల్ గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు రూ.15 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు సొంత డబ్బులను వెచ్చించారు. అలాగే మండలంలోని ధర్మోరా గ్రామ సర్పంచ్ మామిడి సంజీవరెడ్డి నెలకు కేవలం ఒక రూపాయి మాత్రమే గౌరవ వేతనం తీసుకొని మిగతా మొత్తాన్ని గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని ప్రమాణ స్వీకారం అనంతరం హామీ ఇచ్చారు. ప్రజలకు తాను నాయకునిగా కాకుండా సేవకునిగా పనిచేస్తానని అన్నారు. అబ్దుల్లాపూర్ సర్పంచ్ గడిగే జయలలిత – భోజన్న మాట్లాడుతూ ఈ ఆదర్శ గ్రామం ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని, అన్ని వర్గాల ప్రజలు,గ్రామ అభివృద్ధి కమిటీ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.

More articles

Latest article