పార్టీలు మారకుంటే బిఆర్ఎస్ సమావేశానికి హాజరుకండి.

Must read

పార్టీలు మారకుంటే బిఆర్ఎస్ సమావేశానికి హాజరుకండి.

ఎమ్మెల్యేలకు సవాల్ విసిరిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్.

జీ న్యూస్ హుజురాబాద్

బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది స్వార్థ బుద్దితో కాంగ్రెస్ లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో చేరలేదని ప్రగల్బాలు పలుకుతున్నారని, నిజంగా వారు పార్టీ మారకుంటే ఈనెల 21న జరిగే టిఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ సవాల్ విసిరారు.  శుక్రవారం హుజురాబాద్ లోని తన కార్యాలయంలో  బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీకి పోయిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.  గెలిపించిన ప్రజలను మోసం చేస్తూ పార్టీ మారి ఇప్పుడు చర్యలు తీసుకుంటారనే భయంతో సమయానికి తాము పార్టీలు మారలేదంటూ దొంగ మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.  నిజంగా పార్టీ మారాలనుకుంటే, సదరు ఎమ్మెల్యేలకు దమ్ముంటే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులు పొంది కష్టకాలంలో పార్టీని వదిలి పోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇప్పటికైనా పార్టీ నుంచి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పడంలో నిజాయితీ ఉంటే టిఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలన్నారు.   హాజరు కాకపోతే వారు పార్టీ మారిన ప్రజా ప్రతినిధులుగా మిగిలిపోతారని, ప్రజల దృష్టిలో చులకన అవుతారన్నారు. బీఆర్​ఎస్​ పార్టీలో గెలిచి స్వలాభం కోసం పార్టీ మారిన ప్రజాప్రతినిధులు ప్రజల ముందు దోషులుగా నిలబడతారని, భవిష్యత్తులో వారికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదన్నారు.

More articles

Latest article