సర్పంచులను సన్మానించిన సుడా చైర్మన్

Must read

 సర్పంచులను సన్మానించిన సుడా చైర్మన్

అభివృద్ది కోసం కలసిరావాలిన పిలుపు

జీ న్యూస్​ కరీంనగర్​ 

కరీంనగర్​ రూరల్​లో గెలిచిన సర్పంచ్​లను శుక్రవారం సుడా చైర్మన్​ కోమటి రెడ్డి నరేందర్​ రెడ్డి ఘంనగా సన్మానించారు. గెలిచిన సర్పంచ్​ల వద్దకే వెల్లి వారిని సన్మానించి అభినందనలు తెలిపారు.  చామన్ పల్లి సర్పంచ్​ బోగొండ అయిలయ్య , చర్లభూత్కూర్ సర్పంచ్​ నరేష్ రెడ్డి,   దుబ్బపల్లి సర్పంచ్​ మోతె ప్రశాంత్ రెడ్డి , బహదూర్ ఖాన్ పేట సర్పంచ్​ గుర్రం సంధ్య–తిరుపతి, ఫకీర్ పేట్ సర్పంచ్​ బొద్దుల విజయలక్ష్మి, చేగుర్తి సర్పంచ్​ భాషవెని సరోజన–మల్లేశం, నల్లగుంట పల్లి సర్పంచ్​ వడ్లూరి అంజయ్య , తహర్ కొండా పూర్ సర్పంచ్​ ఆకుల యాదగిరిలను సన్మానించారు.  గత పది రోజులుగా నిరంతరంగా, ఎప్పటికప్పుడు కాంగ్రెస్​ బలపరచిన సర్పంచ్​ అభ్యర్థుల గెలుపుకోసం పాటుపడి గెలిపించుకున్నామన్నారు. సర్పంచ్​లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేసే విధంగా సుడా చైర్మన్​ కృషి చేశారన్నారు.  సుడా నిధుల ద్వారా చేస్తున్న అభివృద్ధితో పాటు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి వారి గెలుపుకు సహకరించిన సుడా చైర్మన్ కు సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచులతో పాటు ఇతర సర్పంచులను సైతం కలిసి వారిని శాలువాతో సత్కరించి వారిని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

More articles

Latest article