కేంద్ర నిధులతోనే గ్రామల అభివృద్ది
–పగడాల కాళీ ప్రసాద్
జీ న్యూస్ పరకాల
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ది సాద్యమవుతుందని, గ్రామాలలో బీజేపి బలపరచిన సర్పంచ్లను ఎన్నుకుంటే అభివృద్దిలో ముందుంటాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు, పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ప ఎమ్మెల్యే క్యాండెడెట్ పగడాల కాళీ ప్రసాద్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పరకాల నియోజకవర్గం నడికూడా మండలం వెంకటేశ్వర్పల్లి గ్రామంలో బిజెపి బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్ల కోసం ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి వంగ మల్లికార్జున్, వార్డ్ మెంబెర్స్ మోత్కూరి లక్ష్మీ–రమేష్, వంగ శరణ్య–మల్లికార్జున్, కోట తిరుపతి, ఎరుకల రాజారెడ్డి, మందోటి విజయేందర్, చేకిలె జామున–రవీందర్ లకు మద్దతుగా గ్రామంలో ఇంటింటికి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ గ్రామపంచాయతీల అభివృద్ధి కేవలం కేంద్ర నిధుల ద్వారానే సాధ్యమన్నారు. బిజెపి బలపరిచిన అభ్యర్థి వంగ మల్లికార్జున్ గారి బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన వెంట 56వ డివిజన్ అధ్యక్షులు మహేందర్ పటేల్, సీనియర్ నాయకులు పెంతల జగన్, ఎరుకల శ్రీనివాస్, ఆకుల రాజు, మందుటి మహేందర్, కోట మల్లయ్య, కోట రవి శంకర్, లింగం, బిక్షపతి, అంజి, ఆకుల నవీన్, ఎల్లస్వామి, గొనె రాకేష్, గొనె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

