25 లక్షల నిధులతో ఏరియా ఆసుపత్రి లో బట్టలు ఉతికే యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
జీ న్యూస్ బైంసా
ఏరియా ఆసుపత్రి లో 25 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన బట్టలు ఉతికే యంత్రాన్ని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆసుపత్రి కి వచ్చే రోగులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏరియా ఆసుపత్రి ని మరింత ఆధునికరించి,రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. భైంసా లో ప్రసూతి ఆసుపత్రి ని ఏర్పాటు చేస్తామని,ఆసుపత్రి ఏర్పాటుకు ఐదు ఎకరాల స్థలాన్ని సేకరించినట్లు చెప్పారు. కార్యక్రమం లో డిసిహెచ్ఓ సురేష్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కాశీనాథ్, వైద్యులు అనిల్, విజయానంద్, ఆస్పత్రి సిబ్బంది, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
