వరల్డ్ ఎక్సలెన్స్ బుక్ అఫ్ రికార్డ్ కు వెంకటేశ్వర రాజు
జీ న్యూస్ అమరావతి
తాను పొందిన అవార్డులతో వరల్డ్ ఎక్సలెన్స్ బుక్ అఫ్ రికార్డు కు రచయిత కొండూరు వెంకటేశ్వర రాజు ఎంపిక అయినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధి విందూరు జడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడుగా కొండూరు వెంకటేశ్వర రాజు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. విద్య సాహిత్య కళా రంగాల్లో తనదైన సేవలతో రానిస్తూ ఐఎస్ఓ గుర్తింపు కలిగిన వివిధ జాతీయ అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థల నుండి 228 అవార్డులను అందుకున్నారు. ఈ వివరాలతో ఆయన న్యూఢిల్లీ కేంద్రంగా పబ్లిష్ అవుతున్న వరల్డ్ ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ రికార్డుకు ఎంపికయ్యారు. ఈ రికార్డుకు సంబంధించిన దృవపత్రాన్ని శుక్రవారం ఆన్లైన్ లో అందుకున్న వెంకటేశ్వరరాజును పలువురు కవులు, సాహితివేత్తలు, ఉపాధ్యాయులు అభినందించారు. మరింత ఉన్నత శిఖరాలకు వెంకటేశ్వరరాజు చేరుకోవాలని ఆకాంక్షించారు.

