వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగుదాం
బీసీ ఆజాదీ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చిలుక మారి శ్రీనివాస్
జీ న్యూస్ హుజురాబాద్ :
వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చిలుక మారి శ్రీనివాస్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి ని పురస్కరించుకుని హుజురాబాద్ పట్టణంలోని బీసీ ఆజాదీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుక మారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఆ మహనీయుని జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. అతని త్యాగం, అతని పోరాటం నేటికీ చిరస్మరణీయం అన్నారు. నేటి యువత వారు చూపిన మార్గాన్ని అనుసరించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని, వారిని ఆదర్శంగా తీసుకొని, ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు మమునూరి ప్రవీణ్, పంజాల వెంకటేశ్వర్లు గౌడ్, కందుకూరి భాస్కర్, కొలిపాక శ్రీనివాస్, ఎరబోజు నారాయణ, సబ్బని రాజేందర్, పోగు శ్రీనివాస్, కొత్తూరు జీవన్, రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

