ప్రచార హోరు.... కరుణశ్రీ కుమారన్న జోరు..
– గడప గడపకు మున్సిపల్ ప్రచారంలో పాల్గొన్న కుమార్ మిత్రబృందం.
– 28వ వార్డ్ లొ జోరుగా ప్రచారం..
జీ న్యూస్ హుజురాబాద్
మున్సిపల్ పోరు జోరు అందుకుంది….28 వార్డులో కరుణ శ్రీ కుమార్ – ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆదివారం గడపగడపకు ప్రచారంలో భాగంగా తన వార్డులోని ప్రజలను ఇంటింటికి వెళ్లి కలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ప్రచార సమయంలో మహిళలు, వార్డ్ సభ్యులు పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వాగతం పలికారు. 15 సంవత్సరాలుగా పట్టణంలో వైద్య సేవలు అందిస్తూ వచ్చానని, వారి ఆశీస్సులు తనకుంటాయని కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్లొ, తన వార్డులో చేయబోయే అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. హుజురాబాద్ మున్సిపల్ పీఠంపై జెండా ఎగరవేస్తున్నామని ధీమావ్యక్తం చేశారు. ప్రచారంలో కుమార్ వాకర్స్ మిత్ర బృందం భారీ సంఖ్యలో వచ్చి గడపగడప ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ పార్టీ నాయకులు, 28వ వార్డ్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![]()
