ఆగస్టు నెలలో తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Must read

తిరుపతి, 2025 జూలై 27: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో న‌వంబరులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

–   ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చిపై ఊరేగిస్తారు.

 – ఆగస్టు 9వ  తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్స‌వర్లకు అష్టోత్తర కలశాభిషేకం,  సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.

  ఆగస్టు 16న శ్రీకృష్ణాష్టమి ఆస్థానం.

  ఆగస్టు 18న ఉట్లోత్సవం.

  ఆగస్టు 20న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది.  సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.      

  ఆగస్టు 23న అమావాస్య సందర్భంగా ఉదయం 9 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_img

Latest article