అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్దులను గెలిపించండి …కవ్వంపల్లి
జీ న్యూస్ తిమ్మాపూర్
గ్రామాల అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థుల తరుపున సోమవారం మానకొండురు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రెడ్డిగాని విజయ రాణి తరుపున ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా లో రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదని విమర్శించారు. నేటి ప్రజా ప్రభుత్వంలో ఆర్హత కలిగిన ప్రతి కుటుంభానికి రేషన్ కార్డులు అందించామని, పేదలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందుతుందన్నారు. రేషన్ కార్డుల లబ్దిదారులకు సన్న బియ్యం అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కలిపిస్తూ ప్రజల మన్ననలు పొందామన్నారు. గత పది ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సర్పంచులకు నిధులు ఇవ్వక గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, రానున్న కాలంలో ప్రజా ప్రభుత్వంలో గ్రామాలకు నిధులు అందించి అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా చూస్తామన్నారు. నేదునూరు గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయని అవి గత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డిగాని విజయ రాణి ని గెలిపిస్తే గ్రామంలోని సిసి రోడ్లు, వీధి దీపాలు, గ్రంథాలయ ఏర్పాటు, కుల సంఘాల భవనాలు, మహిళా సంఘాల భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చేలా చూస్తానని, పోచమ్మ టెంపుల్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రెడ్డిగాని రాజు, మాజీ సర్పంచ్ శ్రీగిరి రంగారావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గోపు మల్లారెడ్డి, కరివేద రంగారెడ్డి, నీలం చంద్రారెడ్డి, గంగుల లక్ష్మారెడ్డి రెడ్డిగాని స్వామి, మొగిలి, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

