జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటిన టెట్రాహెడ్రన్ విద్యార్థులు
జీ న్యూస్ హుజురాబాద్
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2025-26 లో విజేతలుగా హుజురాబాద్ పట్టణంలోని టెట్రాహెడ్రాన్ పాఠశాల విద్యార్థులు నిలిచినట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొంది. 9వ తరగతి విద్యార్థిని కె లక్ష్మీ ప్రసన్న “ఆరోగ్యం & పరిశుభ్రత” అంశంలో జిల్లా స్థాయిలో ప్రధమ బహుమతి పొందడం తో పాటు రాష్ట్ర స్థాయికి ఎంపికైందన్నారు. 9వ తరగతి విద్యార్థని జె హర్షిత “పునరుత్పాదక శక్తి ” అనే అంశంలో తృతీయ బహుమతి సాధించిందని వెల్లడించారు. అత్యుత్తమంగా రాణించి బహుమతులు అందుకున్న విద్యార్థులను గైడ్ టీచర్ జి మృత్యుంజయ, పాఠశాల కరెస్పాండంట్ ముచ్చ నారాయణ రెడ్డి, డైరెక్టర్లు తిప్పర్తి రమణ రెడ్డి, కొరెo సంజీవరెడ్డి, సుంకిశాల సంతోష్ రావు, మాడ రాజి రెడ్డి, కేతిరెడ్డి సంపత్ రెడ్డి, పాఠశాల అడ్వైజర్ కడవెరుగు సత్యనారాయణ, ప్రిన్సిపాల్ ఇ నరేశ్, ఉపాద్యాయులు అభినందించారు.