తెలంగాణ యువకుడికి అమెరికాలో అపూర్వమైన గౌరవం

Must read

తెలంగాణ యువకుడికి అమెరికాలో అపూర్వమైన గౌరవం

జీ న్యూస్​ హైదరాబాద్

తెలంగాణ యువకుడికి అమెరికాలో అపూర్వమైన గౌరవం దక్కింది. మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్‌గా తెలుగు వాడు అందునా తెలంగాణ ప్రాంతానికి చెందిన సన్నీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. సన్నీరెడ్డి ఎన్నికను ప్రవాస భారతీయులు స్వాగతించారు. ఈ ఎన్నిక ద్వారా ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టీమ్ లో ఒకరిగా నిలిచారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కు చెందిన సన్నీరెడ్డి, నాయకత్వ పటిమ, నిజాయితీ, ప్రజాసేవను గుర్తించిన రిపబ్లికన్ పార్టీ కో చైర్ గా ఎన్నుకొంది. అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని కో చైర్ గా ఎన్నుకుంటారు. వీరంతా అధ్యక్షుడికి ఆయా రాష్ట్రం నుంచి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అగ్రరాజ్యంలో పార్టీ కో ఛైర్ గా నిలిచిన ఏకైక తెలుగు వ్యక్తిగా సన్నిరెడ్డి నిలిచారు.

మిచిగన్ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐ సన్నీ రెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ గా కూడా ఎన్నికయ్యారు. ఈ మధ్యనేఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో తలలు పండిన అందరినీ వెనక్కి తోసి రిపబ్లికన్ పార్టీ తరపున మంచి మెజారిటీతో సన్నీ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు.1994లో ఆయన వెయిన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆయన చివరకు అదే వర్శిటీలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ ఎన్నికైన మొదటి వ్యక్తిగా నిలిచారు.అనేక సంవత్సరాలుగా మిచిగన్ రాష్ట్రంలోని విద్య,ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు తనను ఈ స్థాయికి తీసుకు వచ్చాయంటారు సన్నీరెడ్డి.. కాలేజ్ ట్యూషన్ కాస్ట్స్ తగ్గించి విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం,విద్యను రాజకీయాలకు అతీతంగా ఉంచడం, ఆలుమినితో కెరీర్ గైడెన్స్ సేవలను విద్యార్థులకు అందించేలా చేయడం వంటి విషయాలను వివరించి మిచిగన్ ఓటర్లను ఆయన ఆకట్టుకున్నారు. సన్నీరెడ్డికి అమెరికా తెలుగు సంఘంతో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ఆటాకి సేవలందిస్తున్నారు. 2017 లో హూస్టన్, 2021 లో కెంటకీ, 2024 లో ఫ్లోరిడా హరికేన్ల సమయంలో అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటీతో పని చేయడమే కాకుండా కావాల్సిన ఫండ్స్ రైజ్ చేశారు. ఆయనకు ట్రంప్ బృందంలో చోటు లభించడం అమెరికాలోని తెలుగువారికే కాకుండా ఇండియన్ కమ్యూనిటీ సైతం గర్వించదగిన విషయమని పలువురు ఎన్నారైలు అభిప్రాయపడ్డారు.

More articles

Latest article