రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు లెజెండ్ విద్యార్థిని
అభినందించిన కరస్పాండెంట్ రాజయ్య
జీ న్యూస్ కరీంనగర్
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన భగత్ నగర్ లోని లెజెండ్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రేష్ట నందిని ని పాఠశాల కరస్పాండెంట్ రాజయ్య అభినందించారు. శనివారం పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రేష్ట నందినిని అభినందించారు. ఈనెల 8 నుండి మూడు రోజులపాటు ఆదిలాబాద్ లో జరగనున్న 36వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో ఆమె పాల్గొనున్నది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో విద్యార్థులు రాణించాలని, క్రీడల ద్వారా శారీరక, మానసిక దారుఢ్యం బలపడుతుందన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు విధ్యతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులచే క్రీడలలో శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలో నిర్వహింపబడేటువంటి పోటీలలో పాల్గొనేలా వారిని సిద్ధం చేస్తున్నామన్నారు. క్రీడలకు సంబంధించి విద్యార్థులకు కావలసినటువంటి వనరులు కల్పించి వారిలో దాగివున్న ప్రతిభను వెలికి తీస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
