ఎస్టీయూ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా గ్రంధాలయ చైర్మన్

Must read

ఎస్టీయూ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా గ్రంధాలయ చైర్మన్

జీ న్యూస్ కరీంనగర్

స్టేట్ టీచర్స్ యూనియన్ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన2026 క్యాలెండర్ ను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ శుక్రవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో పుస్తక పఠనం, గ్రంథ పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన చోట గ్రంథాలయ నిర్వహణకోసం చరిత్ర,పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందజేయనున్నట్లు తెలియజేశారు.  పదవ తరగతి ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా పూర్వ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఆర్ శ్రీనివాస్, కట్టా రవీంద్రచారి, కొత్తపల్లి మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెలిచాల వెంకటస్వామి, తాడూరి మాధవస్వామి,  సీనియర్ నాయకులు కొట్టె లక్ష్మణరావు, చాడ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article