కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరిట భారీ దోపిడి
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్
జీ న్యూస్ కరీంనగర్
స్మార్ట్ సిటీ పేరిట గత ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుందని, తక్షణమే ఆ నిదుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుదవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజేయ్ అధ్యక్షత నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ, తీగల వంతెన నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కోట్ల రూపాల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు ఎక్కడ కనిపించడం లేదని కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో భారీ కుంభకోణం జరిగిందని, అవినీతి జరిగిందని ఆరోపించారు. తీగల వంతెన పనుల్లో భారీ అంచనా వేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని పంచుకున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ స్మాల్ సిటీ, తీగల వంతెనపైన విచారణ చేపట్టి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి. క్రిమినల్ కేసులో నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలతో స్మార్ట్ సిటీ పై తీగలు వంతెన నిర్మాణంపై విచారణ కమిటీ వేస్తామని, ఆ విచారణ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. భారీ కుంభకోణం వెనుక దాగిఉన్న అవినీతి కి పాల్పడిన ప్రజా ప్రతినిధులపై కేసు నమోదు చేసి జైలుకు పంపి విచారణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజయ్. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుకురు శ్రీనివాస్. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోగురం మిరియా. మహిళా నాయకురాలు లలిత, నాయకులు కొమురయ్య, ముత్యం అశోక్ రెడ్డి, లింగయ్య, వినోద్ కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
