ఘనంగా సాయన్న ముదిరాజ్ వర్ధంతి వేడుకలు.

Must read

ఘనంగా సాయన్న ముదిరాజ్ వర్ధంతి వేడుకలు.

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు.

జీ న్యూస్​ హూజురాబాద్

బహుజన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి వేడుకలను బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల నాయకులు బుదవారం హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పండగ సాయన్న ముదిరాజ్ 1860 ప్రాంతం నుండి 1900 కాలంలో అప్పటి నిజాంకు వ్యతిరేకంగా బలహీన వర్గాలకోసం పోరాటం చేశాడన్నారు.  బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తూన్న  జమిందారి దేశముఖ్​ లకు వ్యతి రేకంగా పోరాడిన దీశాలి అని కొనియాడారు.   సంపన్న వర్గాలను కొల్లగొట్టి పేద వర్గాలకు పంచిన తెలంగాణ రాబిన్ హుడ్, సాయన్న అభినవ రాభిన్​ హుడ్​ గా నిలిచాడన్నారు. సామాజిక న్యాయం దిశగా పోరాటాలు చేస్తూ బీసీలసామ్రాజ నిర్మాణానికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఆజాది ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్, బిసి ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ కొలిపాక శంకర్,  నాయకులు సొల్లు బాబు, వేల్పుల రత్నం,  తులసి లక్ష్మణమూర్తి, మైనార్టీ నాయకులు ఖలీద్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్ ముక్క రమేష్, ఉప్పు శ్రీనివాస్, మంద బిక్షపతి, కామని సమ్మయ్య,  ప్రవీణ్,  ఎర్రబోజు నారాయణ, అనగోని శ్రీనివాస్, బత్తుల మనోజ్,  కుమార్ గోపి, కొలిపాక శ్రీనివాస్, మట్టెడ ప్రకాష్, తూం వెంకట్రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article