Rakul Preet Singh | దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు.. ట్రోల్స్‌పై రకుల్ ఘాటు వ్యాఖ్యలు

Must read

Rakul Preet Singh | సోషల్ మీడియా ట్రోల్స్‌పై నటి రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలో పెరిగిపోయిన నెగటివిటీకి పని లేకపోవడమే కారణమని, కొంతమంది ఇతరుల జీవితాలపై అనవసర కామెంట్లు చేయడం తప్ప ఇంకేమీ చేయడం లేదని ఆమె అన్నారు.

రకుల్ తాజాగా చేసిన ఓ పోస్ట్‌లో “ఫ్రీ డేటా, పనిపాట లేకపోవడం వల్లే కొంతమంది నెగటివిటీని విపరీతంగా వ్యాపింపజేస్తున్నారు. సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి దుష్ప్రచారాలు చేయడం, మానసికంగా బాధ పెట్టడం వారి నిత్యకృత్యంగా మారిపోయింది. మన దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువైపోయారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతమంది నెటిజన్లు రకుల్‌ను సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులకు ఎన్నో హిట్ సినిమాలతో దగ్గరైన రకుల్ ప్రీత్ ఇటీవల పెళ్లి చేసుకుని సినిమాలకు కొంత గ్యాప్ తీసుకుంది. తాజాగా ఆమె నటించిన ‘మేరే హస్సెండ్ కి బివి’ అనే చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రకుల్, ట్రోలింగ్‌కు ధీటుగా కౌంటర్‌లు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు.

More articles

Latest article