రజకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ప్రాణం విడిచిన రెండు నెలల పసిపాప బలి.
హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రజక మహిళలతో కలిసి నిరసన.
జీ న్యూస్ హుజురాబాద్ ప్రతినిధి,
రజకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ రజక సంఘం రాష్ట్ర నాయకులు నిమ్మటూరి సాయికృష్ణ ఆధ్వర్యంలో సోమవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రజక మహిళలతో కలిసి ధర్నా చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ..మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డు కొని, వారి కుటుంబం పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇకనైనా చైతన్య అవుదాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలంతా ఏకమవుదాం. పోరాడుదాం అసమానతలు, వివక్ష, అస్పర్శత లేని సాంప్ర దాయాన్ని సంస్కృతిని విశ్వవ్యాప్తం చేద్దాం, దాడికి గురైన కుటుంబాన్ని ఆదుకుందాం అండగా ఉందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొలిపాక సారయ్య, నల్ల బాలరాజ్, కొలిపక శ్రీనివాస్, కొండపాక పవన్, నల్ల సుమన్,కొండపాక లక్ష్మి, నిమ్మటూరి రమ, వసంత, భూలక్ష్మి, సరూప, కొలిపాక రంగయ్య, ప్రజా సంఘాల నాయకులు,వేల్పుల ప్రభాకర్, సాదుల రవీందర్, బిసి ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకమారి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, నడిగొడ్డి రమేష్, మామునూరి ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, సుంకరి రాజమౌళి, కొలిపాక శ్రీనివాస్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
