పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లొ ఏసీపీ మాదవికి 2 గోల్డ్ మెడల్స్ 

Must read

పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లొ ఏసీపీ మాదవికి 2 గోల్డ్ మెడల్స్ 

కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారుల ఘన విజయం 

35 పతకాలతో సత్తా చాటిన పోలీస్ సిబ్బంది.

జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి 

గతవారం రోజులుగా సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నాల్గవ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లోనిర్వహించిన క్రీడా పోటీల్లో కరీంనగర్పో జిల్లా పోలీస్ విభాగం అసాధారణ ప్రతిభను కనబరిచింది. హుజురాబాద్ ఏసిపి మాధవి టేబుల్ టెన్నిస్ విభాగంలో 2 3లతో పాటు రజత పథకం యోగాలో కాంస్య పతకం సాధించి టాపర్ గా నిలిచారు.  వివిధ విభాగాల్లో పోటీ పడిన పోలీస్ అధికారులు,  సిబ్బంది తమ నైపుణ్యంతో మొత్తం 35 పతకాలను కైవసం చేసుకున్నారు. ఇందులో 9 స్వర్ణ, 13 రజత మరియు 13 కాంస్య పతకాలు ఉండటం విశేషం.

​విజేతల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

​ప్రధాన విజేతలు – పతకాల వివరాలు:

​మాధవి (ACP): టేబుల్ టెన్నిస్‌లో 2 స్వర్ణ పతకాలు, బాడ్మింటన్‌లో రజత పతకం మరియు యోగాలో కాంస్య పతకాన్ని సాధించారు.

​జి. రవి కిరణ్ (ఇన్‌స్పెక్టర్): 45+ బాడ్మింటన్‌లో కాంస్య పతకం మరియు 45+ సింగిల్ షటిల్‌లో రజత పతకం గెలుచుకున్నారు.

​ఎ. స్వప్న (PC 3088): ఆర్మ్ రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ (డబుల్స్) మరియు టేబుల్ టెన్నిస్ (టీమ్) విభాగాల్లో మొత్తం 3 స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.

​ఎల్. శ్రీజ (PC 3718): టేబుల్ టెన్నిస్ (డబుల్స్) మరియు టేబుల్ టెన్నిస్ (టీమ్) విభాగాల్లో 2 స్వర్ణ పతకాలు, అలాగే టేబుల్ టెన్నిస్ (సింగిల్స్) లో రజత పతకం సాధించారు.

​శ్రీధర్ (PC 282): స్విమ్మింగ్ పోటీల్లో గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ మెడల్స్‌ను సాధించి బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు.

​జె. సాయి దీప్ (PC 3229): వాటర్ స్పోర్ట్స్ విభాగంలో ఒక స్వర్ణ మరియు ఒక కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.

​పతకాలు సాధించిన ఇతర సిబ్బంది:

​ఎండి సోహైల్ (PC 3714): రెజ్లింగ్ (కుస్తీ) – కాంస్య పతకం.

​ఎం. అరుణ (PC 47): పవర్ లిఫ్టింగ్ – రజత పతకం.

​కె. గౌతమి ప్రసన్న (PC 3611) & ఎల్. జయ (PC 3604): కబడ్డీ – కాంస్య పతకాలు.

​డి. బాలకృష్ణ (PC 3007) & ఎ. శంకర్ (PC 984): యోగా – చెరో 2 రజత పతకాలు.

​ఎండి సల్మాన్ అలీ (PC 3809): జూడో – కాంస్య పతకం.

​మల్లేష్ (HC 2612): 45+ బాడ్మింటన్ – కాంస్య పతకం.

​డి. రాజు (PC 3350): డిస్కస్ త్రో – రజత పతకం.

​వై. రవి కుమార్ (HC 310): ఆర్మ్ పవర్ లిఫ్టింగ్ – రజత పతకం.

​కె. గణేష్ (RSI): బాడీ బిల్డింగ్ – రజత పతకం.

​ఎ. తిరుపతి (PC 3336): హ్యామర్ త్రో – రజత పతకం.

​పి. ఉమారాణి (ASI 2124 CCS): టేబుల్ టెన్నిస్‌లో ఒక కాంస్య మరియు షటిల్‌లో 3 కాంస్య పతకాలు సాధించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ కఠినమైన విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల పట్ల అంకితభావం ప్రదర్శించి, ఇన్ని పతకాలు సాధించిన క్రీడాకారులను కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.గెలుపోటములు సహజమన్నారు. విజేతలు జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేయాలని,ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా తమ లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ విజయాలు శాఖలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని వారు పేర్కొన్నారు.

More articles

Latest article