పిన్నోజు ప్రసాద్ కు డాక్టరేట్

Must read

పిన్నోజు ప్రసాద్ కు డాక్టరేట్
జీ న్యూస్​ వరంగల్​
మహబూబాబాద్ జేఎన్​టీయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ రసాయన శాస్త్రం విభాగంలో సహాయక ఆచార్యులుగా పని చేస్తున్న పిన్నోజు ప్రసాద్ కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగం నుంచి డాక్టరేట్ పట్టాపొందినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రసాద్ తన పీహెచ్.డి పరిశోధనను శాతవాహన యునివర్సిటీ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్​ ప్రోఫెసర్​ ఆచార్య డాక్టర్ సరసిజ మార్గదర్శకత్వంలో “సింథసిస్ సాఫ్ నావెల్ ట్రైజోల్ హైబ్రిడ్ అండ్ దేర్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ స్టడీస్”తో పరిశోధన పూర్తిచేశారన్నారు. IITM మద్రాసు ప్రొఫెసర్​ ఆచార్య బీరయ్య పర్యవేక్షనలో పనిచేశారన్నారు. ఈ పరిశోధనలో వివిధ రకాల ట్రై జోల్స్ ను తయారుచేసి, వాటి క్యాన్సర్ వ్యతిరేక క్రియాశీలకను పరీక్షించడం జరిగిందన్నారు. ప్రసాద్ తన పీహెచ్.డి కాలంలో మొత్తం 5 పరిశోధన పత్రాలు ప్రచురించారని, వీటిలో 3 అంతర్జాతీయ సదస్సు పత్రాలు, 2 పేటెంట్లు ఉన్నాయన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ఆధునిక రసాయన శాస్త్ర రంగంలో ఆయన చేసిన విలువైన కృషిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. డాక్టరేట్​ పట్టా పొందిన సందర్బంగా ప్రసాద్ ను విశ్వవిద్యాలయం కళాశాల ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్ ప్రిన్సిపాల్ డా. ఏ. బలరాం నాయక్, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.

More articles

Latest article