సమన్వయంతో అటవీ సంపదను సంరక్షించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Must read

సమన్వయంతో అటవీ సంపదను సంరక్షించాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి జీ న్యూస్

జిల్లాలోని రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తూ అటవీ సంపదను కాపాడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి. వేను, డీసీపీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలో అటవీ నరికివేత జరగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. అటవి నరికివేతకు పాల్పడే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. కొత్త అటవీ ఆక్రమణలకు కూడా అనుమతించకూడదు.సమావేశంలో అటవీ అధికారి శివయ్య ప్రొజెక్టర్ ద్వారా అటవీ స్థితిగతులను అధికారులకు వివరించారు. అలాగే, రెవెన్యూ డివిజన్ అధికారులు బి. గంగయ్య, సురేష్, ఏసీపీలు కృష్ణ, రమేష్, అటవీ శాఖ అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article