ప్రజా సేవ కోసం ఎన్నికల బరిలో తోటకూరి శ్రీనన్న
జీ న్యూస్ పెద్దవంగర
మండలంలోని అవుతాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తోటకూరి శ్రీనివాస్ మంగళవారం నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ. గ్రామ అభివృద్ధకి పాటుపడుతూ, ప్రజల సమస్యలకు గళమెత్తే నాయకుడిగా పని చేస్తానన్నారు. అవుతాపురం గ్రామాన్ని ప్రజలు, అధికారుల సహకారం తో ఉన్నతమైన స్థాయిలో ఉంచేలా కృషి చేస్తానన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో నెలకొని ఉన్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో అందరికి అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిపి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
