తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే
– ఆర్పిఐ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్.
జీ న్యూస్ కరీంనగర్
సినిమా హీరో. అంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజలకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని రిబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర యువత. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరు కలిసి తెలంగాణను సాధించుకొని, అభివృద్ధి పథంలో నడుస్తుంటే ఓర్వలేక పోతున్నారన్నారు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి చెట్లు ఎండిపోతే. తెలంగాణ ప్రజల వల్లనే. ఎపిలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని అనడం ఎంతవరకు సబబు అన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో సానుభూతితో, అదృష్టం తో అక్కడ గెలిచి, మా తెలంగాణ ప్రాంతాన్ని కించపరచి నట్లు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమించరుని, తరిమి తరిమి కొడుతారని హెచ్చరించారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
