మానవత్వం చాటుకున్న పసుల రవికుమార్
జీ న్యూస్ కరీంనగర్
సామాజిక సేవకుడు, రచయిత, నటుడు, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ పసుల రవికుమార్ మనవతా స్పూర్తని చాటుకున్నాడు. కరీంనగర్ పోచమ్మ వాడకు చెందిన పసుల రవి కుమార్ పటేల్ వృత్తి ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ గా విధి నిర్వహిస్తూ, మిగతా సమయాలలో సామజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. పేద కళాకారుడు మునీందర్ తన కష్టాన్ని చెప్పుకోగానే ఆయన కుమారుడికి స్కూల్ బ్యాగ్, చలికాలం ఇబ్బంది పడకుండా దుప్పట్లు కొని ఆదివారం రవికుమార్ నివాసంలో మునిందర్కు అందించాడు. ఈ సందర్బంగా పసుల రవికుమార్ మాట్లాడుతూ నాకు తోచినంత సహాయం చేయడం అదృష్టంగా భావిస్తానన్నాడు. తన కుటుంభ సభ్యుల సహకారంతో ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించానన్నారు. పేద కలాకారులను ఆదుకునేందుకు తనకు తోచిన సహాయాన్ని అందిస్తున్నానని తెలిపారు. నిరుపేదలకు, అనాధలకు, వృద్ధులకు ప్రతి ఒక్కరు వారికి తోచినంత సాయం చేయాలని కోరారు. ఈ సందర్బంగా పసుల రవికుమార్‌ను పలువురు అభినందించారు.
