*కన్నుల పండువగా పడిపూజ మహోత్సవము*
జీ న్యూస్ ముధోల్,
మండలంలోని గన్నోర గ్రామంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. సునీల్ గురు స్వామి ఆధ్వర్యంలో రాజేష్శ శర్మ చేతుల మీదుగా అయ్యప్ప స్వామికి పంచామృతంతో అభిషేకం చేశారు.గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి చిత్రపటాలను పూలతో అలంకరించారు.అయ్యప్ప స్వామి మాలధారణ మోక్షానికి మార్గం అని తెలిపారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన వారికి స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అయ్యప్పశరణు ఘోషతో, నృత్యాలతో పరిసర ప్రాంతం మారుమోగింది.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అయ్యప్ప స్వాములకు, భక్తులకు బిక్ష ఏర్పాటు చేశారు.

