ప్రజా సేవకు అంకితమైతేనే గుర్తింపు లభిస్తుంది..

Must read

ప్రజా సేవకు అంకితమైతేనే గుర్తింపు లభిస్తుంది..

జీ న్యూస్ ముధోల్

ప్రజాసేవకు అంకితమైతేనే గుర్తింపు లభిస్తుందని ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్,జి డి ఆర్ మెమోరియల్ కృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ అన్నారు. మండలం హావర్గ గ్రామం సర్పంచ్ గా ఎనికైనా కాదం భుజంగారావు పటేల్ ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ మేని పేస్టులో రూపొందించిన అంశాలన్నీ అమలు పరుస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. గ్రామాభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తూ , ప్రజల అభిమానాన్ని చురగొంటూ అంచలంచలుగా ఎదుగుతూ ఉన్నత పదవులు చేపట్టాలని. గ్రామ ప్రజలందరిని కలుపుకొని పని చేసినప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని సూచించారు. ఎన్నికలప్పుడే పార్టీ భేదాలు, ఎన్నికలు ముగిసిన తరువాత పార్టీ భేదాలు చూయించకుండా పనిచేసినప్పుడే నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ఓడినవారు నిరాశ చెందకుండా,ప్రజల సేవలో నిమగ్నమైతే ప్రజలు తప్పనిసరిగా గుర్తిస్తార తెలిపారు.పదవులు ఎవరికి కూడా శాశ్వీతము కాదు. తాత్కాలికమే అన్నారు. గెలిచినవారు, ఓడినవారు మానవసేవయే మాధవసేవయని ప్రజాసేవలో నిమగ్నం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరె మరాఠా సంఘం నాయకులు రఘువీర్ పాటిల్, గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article