కిట్స్ కాలేజిలో సంక్రాంతి సంబురాలు

Must read

కిట్స్ కాలేజిలో సంక్రాంతి సంబురాలు

జీ న్యూస్​ ప్రత్యేక ప్రతినిది

సంక్రాంతి అనే పదంలోనే క్రాంతి ఉందని,  సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాలు తేవాలని  హుజూరాబాద్కి​ కిట్స్ కాలేజి  ప్రిన్సిపాల్ డాక్టర్ కే శంకర్ అన్నారు. హుజరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్, ఎన్ఎస్ఎస్ ల  ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. విద్యార్థని, విద్యార్థులకు నిర్వహించిన రంగోలి, గాలిపటాల పోటీలలో వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు వేసిన రంగవల్లులను ఆయన పరిశీలించి, వారిని ఉత్సాహపరిచారు.  విద్యార్థినిలతో పాటు విద్యార్థలు సైతం ఉత్సాహంగా రంగవళ్లులను వేశారు. ఈ  సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనేది రైతులకు పంట చేతికి వచ్చినప్పుడు జరుపుకునే పండుగన్నారు. బాలికలు, మహిళలు తమ ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకొని పండుగను జరుపుకుంటారన్నారు. బాలురు పతంగులు ఎగరవేస్తారని, పండుగ స్ఫూర్తితో అందరం సంతోషంగా ఉండాలన్నారు. కళాశాల రిజిస్టర్ డాక్టర్ వి. రాజేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కళాశాలలో ముగ్గుల, పతంగి పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల విజేతలను నిర్ణేతలుగా వ్యవహరించిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎన్. శశికళ, డాక్టర్ సునీత లు ఎంపిక చేశారు. డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ యోగేష్ ఫుండలీక్​, స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ కోఆర్డినేటర్స్ డాక్టర్ ఏ .కొమురయ్య, గౌరీ పుండలిక్, ఈ కార్యక్రమ సమన్వయకర్తలు అధ్యాపకులు సుభద్ర ,సుప్రీత, యాహుబ్ ,కిరణ్, రాకేష్,  ఎన్​ఎస్​స్​ కోఆర్డినేటర్​ లు డాక్టర్ ఏ జాన్సన్, డాక్టర్ వీరు నాయక్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.  అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

 

More articles

Latest article