ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోండి
ఉద్యమకారులకు కవిత పిలుపు
జీ న్యూస్ కరీంనగర్
ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అందుకే ఎక్కడికక్కడే భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు కవిత పిలుపునిచ్చారు. కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కవిత భూ పోరాటాన్ని బుదవారం ప్రారంభించారు. మనకోండూర్ నుండి వరంగల్ రోడ్డులో మనకోండూర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన తమిళ కాలనీ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఒక్కోకరికి 250 గజాల చొప్పున ఇంటి స్థలం పంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ధర్నా నిర్వహించి, భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మనం కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని, ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశరాఉ. మళ్లీ కమిటీలు అంటూ కాలయాపన చేస్తే ఊరుకునేది లేదన్నారు. కరీంనగర్ గడ్డ మీద ఏ పోరాటం చేసిన అది సక్సెస్ అవుతుందని, ఇవ్వాళ మనం ఉద్యమకారుల కోసం చేస్తున్న భూపోరాటం కూడా సక్సెస్ అవుతుందన్నారు. ఒక్క కరీంనగర్ లో మాత్రమే కాదు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల భూమి ఇచ్చే వరకు పోరాటం చేస్తానన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విలువైన భూములు ఉన్నాయని, అక్కడ కూడా వదలమని, కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తానన్నారు. అప్లికేషన్లు పెట్టుకోమన్నారు అంతే. వారిపై కేసులు లేవు అంటున్నారని, ఉద్యకారులందరిపై కేసులు ఉంటాయా? తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఎంతో మంది ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఊరిలోకి, ఏ జిల్లాకు వెళ్లినా సరే అక్కడి ప్రజలు ఉద్యమకారులెవరో చెబుతారని, వాళ్లు చెప్పిన వారికే ప్రభుత్వం ఇస్తామన్న హామీలు నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని, శాంతియుతంగా పోరాటం చేస్తామని, ప్రభుత్వ పెద్దలు దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందన్నారు.

ఉద్యమ పార్టీలో ఉద్యమ ద్రోహులు
12 ఏళ్లలో ఎంతో మంది ఉద్యకారులు చనిపోయారని, హాస్పిటల్ లో చేరితే వారికి సాయం కూడా చేయలేదని, నిజంగా ఉద్యకారుల కుటుంబాలు ఎంతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకులు, ఉద్యమ ద్రోహులు ఉద్యమపార్టీలోకి వచ్చి మనపైనే పెత్తనం చెలాయిస్తూ కేసులు పెట్టారని, సెక్రటేరియేట్ కు వెళ్తే మనల్నే ఇక్కడ ఏం పని అంటూ అవమానించి, ఉద్యమకారులను ఉరికిచ్చి కొడుతామని కూడా బెదిరించారన్నారు. తెలంగాణ వచ్చాక కూడా మళ్లీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందిని బతుకమ్మ, బోనం ఎత్తాం, వంట వార్పు అంటూ ఉద్యమాలు చేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు నష్టం జరిగితే ఓపిక పట్టామన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఎంతో చేస్తామని మనం చెప్పామని, 12 వందల మంది అమరులైతే మనం 540 మందికి మాత్రమే మేలు చేశామన్నారు. ఎంతో మంది అమరవీరుల కుటుంబాల వారు వచ్చి వారి బాధలు నాకు చెప్పారని, కనీసం జూన్ 2, ఆగస్ట్ 15, జనవరి 26 న ఇలా ఏ రోజు కూడా వారిని గౌరవించలేదన్నారు. ఇప్పుడు ఉద్యకారులంతా ఫోరంగా ఏర్పడి ఒక దగ్గరకు వచ్చారని. ఇక మన ఐక్యతను ప్రదర్శిద్దామన్నారు. తెచ్చుకున్న తెలంగాణ లో ఆత్మగౌరవంతో పాటు మా వాటా ఇవ్వమని మాత్రమే మనం కోరుతున్నామన్నారు. కార్యక్రమం పాల్గొన్న వారిలో జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు లకవత్ రూప్ సింగ్, జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, నాయకులు కనకం కుమారస్వామి, మ్యాకల తిరుపతి, అక్కం శివరాణి, యండి సల్మ, జంగ అపర్ణ తదితరులు పాల్గొన్నారు
