భక్తి శ్రద్దల మద్య జ్వాలా తోరణం

Must read

 

భక్తి శ్రద్దల మద్య జ్వాలా తోరణం   

శివాలయాల్లో మార్మోగిన శివనామస్మరణ

జీ న్యూస్​ హుజూరాబాద్​

కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో నిర్వహించిన జ్వాలాతోరణాన్ని భక్తులు తరలి వచ్చి భక్తి పరవశంతో శివనామస్మరణలో మునిగి పోయారు. హర హర మహాదేవ అంటూ దిక్కులు మార్మోగేలా జయజయద్వానాలు చేశారు.

కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహిస్తారు. శివాలయంలో రెండు కర్రలు నిలువుగా ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చిచుడతారు. దీనికి యమద్వారం అనిపేరు. అసలు జ్వాలాతోరణం ఎందుకు ఏర్పాటు చేస్తారు? దీని కింది నుంచి దాటడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన కూడా కార్తీక మాసం శోభ కన్పిస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపదానం, నదీస్నానం, వనభోజనాలు, గుళ్లకు భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు. ఈ మాసంలో మనం చేసే పూజలు వ్రతాలు, హోమాలు వెయ్యిరెట్లు శుభఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు. అయితే.. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో శివాలయాల్లో ప్రదోష సమయంలో జ్వాలాతోరణంను నిర్వహిస్తారు.

పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలా తోరణం దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి అని నమ్మకం. జ్వాలా తోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. కార్తిక జ్వాలా తోరణ దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి.

జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు. శివ కేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే తెలిసి, తెలియక చేసిన సర్వపాపాలు గాల్లో దుమ్ములా ఎగిరిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్నీతొలగిపోతాయి.   కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా వుంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడి ఉత్సవ విగ్రహాల్ని పల్లకిలో  అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు.

కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. శ్రీనాథుడు ద్రాక్షరామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణించారు.  ఇప్పటికికూడా శివాలయాల దగ్గర తప్పకుండా చాలా మంది పండితులు, ఆలయ నిర్వాహకులు జ్వాలాతోరణంను కార్తీక పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.

More articles

Latest article