పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తున్నాం…ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Must read

పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తున్నాం

జీ న్యూస్​ వేముల వాడ 

సొంత ఇంటిని కట్టుకోవాలనే కలను సామాన్య ప్రజలకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని వేముల వాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సన్మానించి వారి ఆనందాన్ని పంచుకున్నారు.​ ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  గృహప్రవేశ సమయంలో లబ్ధిదారుల కళ్ళలో కనిపించిన ఆనందం, భావోద్వేగం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు.  ఇంటి నిర్మాణ విషయంలో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో స్పష్టమవుతోందన్నారు. దశాబ్దాల తరబడి ఉన్న తమ సొంతింటి కలను కేవలం కొన్ని నెలల కాలంలోనే ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, పేదవాడి బాగోగులు చూసేది కాంగ్రెస్​ ప్రభుత్వం మాత్రమేనన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటని దానిని నెరవేర్చామన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేలా చూడటం తమ ప్రధాన లక్ష్యం అని త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వేగవంతం అవుతుందని ఆయన హామీ ఇచ్చారు. లబ్దిదారులు మాట్లాడుతూ  తమ కలను సాకారం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి, అలాగే నియోజకవర్గంలో చొరవ తీసుకున్న ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

More articles

Latest article