హుజూరాబాద్​ పీవీ జిల్లా ఏర్పాటు చేయాల్సిందే..

Must read

హుజూరాబాద్​ పీవీ జిల్లా ఏర్పాటు చేయాల్సిందే..

జీ న్యూస్​ హుజురాబాద్​

హుజూరాబాద్​ పీవి జిల్లాను ఏర్పటు చేయాల్సిందేనని పివి జిల్లా సాదన సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. హుజూరాబాద్​లో గురువారం వాకర్లతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. హైస్కూల్​ క్రీడా మైదానం నుండి అంబేద్కర్​ చౌరస్థా మీదుగా పీవి విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ హుజూరాబాద్​ మండలానికి జిల్లాకు కావలసిన నైసర్గిక స్వరూపం, వనరులు ఉన్నప్పటికి రాజకీయ కుట్రల కారణంగా పీవీజిల్లా ఏర్పాటు జరుగలేదన్నారు. ఎంతో కాలంగా ఉద్యమం చేస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, పీవీజిల్లా ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమాన్ని వివిద రూపాలలో విస్త్రుతంచేస్తామని ప్రకటించారు. నాడు పాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేసిన సందర్బంగా హుజూరాబాద్​ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని అనేక మార్లు విన్నవించుకున్నామన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కమిటీ ముందుకు, ప్రజా ప్రతినిదులు, మంత్రుల ముందుకు ప్రజల ఆకాంక్షను తీసుకెల్లినా పలితం లేకుండా చేశారన్నారు. ఇటీవల మంత్రులు పొన్నం ప్రభాకర్​ తదితరులతో పాటు పార్టీ ఇంచార్జి ప్రణవ్​లకు వివరించినప్పుడు వారు సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో హుజూరాబాద్​ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. ప్రజాస్వమిక వాదులు, ఉద్యమకారులు, వివిద సంఘాల నాయకులు, యువకులు, విద్యార్థులు అందరూ కలసి కార్యచరణ ఏర్పాటు చేసుకొని ముందుకు కదులుతామన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్​ పీవీ జిల్లా సాధన సమితి నాయకులు, వాకర్ అసోసియేషన్​ సభ్యులు, యువకులు, వివిద పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article