చొల్లేటి కిషన్ రెడ్డి కి ఘన నివాళి
జీ న్యూస్ హుజూరాబాద్
ఇటీవల మృతి చెందిన హుజూరాబాద్ క్లబ్ సంయుక్త కార్యదర్శి చొల్లేటి కిషన్ రెడ్డి కి క్లబ్ సభ్యులు శుక్రవారం క్లబ్ ఆరవణలో మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభ్యులు కిషన్ రెడ్డితో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తర తమ బేదాలు లేకుండా అందరిని కలుపుకుపోయి, అరమరికలు లేకుండా ఉండేవాడన్నారు. క్లబ్లో కిషన్ రెడ్డి ఉన్నంత సేపు లాఫింగ్ క్లబ్లా మారిపోయేదని గుర్తుకు చేసుకున్నారు. ఎవరికి చిన్న సమస్య వచ్చినా తాను మందుకు వచ్చి వారికి దైర్యం చెప్పి, అండగా ఉండేవాడన్నారు. ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే కిషన్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎర్రం నారాయణ రెడ్డి, వీర సేనారెడ్డి, కంకనాల భగవాన్ రెడ్డి, పుల్లూరి ప్రభాకర్ రావు, బండ శ్రీనివాస్, వర్ధినేని రవీందర్ రావు, మెకల రాజిరెడ్డి, పల్కల శ్రీనివాస్ రెడ్డి, ఎరం రాజన్న, పాశం మల్లారెడ్డి, వీరబద్రా రావు, తక్కలపల్లి సంపత్ రావు, మంద రమేష్, విడపు రాజు, గర్రెపెల్లి శ్రీనివాస్, వొడ్నాల సత్యం, చింత శ్రీనివాస్, అడెపు సూర్యం, లక్ష్మణ మూర్తి, కత్తెరమల్ల సదానందం, రావుల రాజ లింగారెడ్డి, గోలి సురేష్, సృజన్, బాస్కర్ రెడ్డి, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.
