గ్రామాభివృద్ధే ధ్యేయం గా ముందుకు..
– సర్పంచ్ అభ్యర్థి..గిర్మాయి చిన్న దేవన్న
జీ న్యూస్ లోకేశ్వరం
గ్రామాభివృద్ధే ధ్యేయం గా, ప్రజలకు సేవ చేసేందుకు సర్పంచ్ బరిలో ప్రజల ముందుకు వచ్చానని సర్పంచ్ అభ్యర్థి గిర్మాయి చిన్న దేవన్న అన్నారు. లోకేశ్వరం మండలం లోని కనకాపూర్ గ్రామానికి బీసీ జరల్ రిజర్వేషన్ కేటాయించ బడింది. దీంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో గిర్మాయి చిన్న దేవన్న పోటీలో ఉన్నారు. గతంలో రాజకీయ నాయకుడిగా గ్రామంలోని అన్ని వర్గాల వారితో కలిసిపోయే అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరుపోందాడు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా అందరి సహాయంతో ముందుకు సాగుతూ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నానన్నారు. గ్రామ ప్రజల ఆశీర్వాదం తనవెంటే ఉందని పూర్తి నమ్మకం ఉందని, చాలా మంది పెద్దలు, గ్రామస్థులు, శ్రేయోభిలాశుల సూచనలతో ప్రజలకు సేవ చేసేందుకు పోటీ చేస్తున్నానన్నారు. అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికై గ్రామస్తులు తనను ఆశీర్వ దించి సర్పంచ్ గా గెలిపించాలని కోరారు.
