దోషులను కఠినంగా శిక్షించాలి
రావుల కార్ వెంకటేష్ డిమాండ్.
జీ న్యూస్ వరంగల్
ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య పై దాడి చేసి తీవ్రంగా గాయపరచిన గంజాయి బ్యాచ్ స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని పీఆర్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గంజాయి స్మగ్లర్ల యొక్క వికృత విపరీతమైన చేష్టలు ప్రభుత్వానికి సవాలుగా మారాయని వారి చేష్టల వల్ల పేద, ధనిక అని తారతమ్యం లేకుండా బాదపడుతున్నారన్నారు. ప్రభుత్వ ప్రైవేటు, విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై శారీరక ,మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపి ఎన్నో వందల కుటుంబాలు తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీ కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రాణాలు అరచేతుల పెట్టుకొని ఉద్యోగం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం సౌమ్యపై దాడికి పాల్పడిన నరరూప రాక్షసులపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన అత్యంత దుర్మార్గమని, క్షమించరాని నేరమని వెంటనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సమూలంగా నిర్మూలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
