పండుగల వేళ పరేషాన్….స్కామర్ల కొత్త స్కీంతో… స్కాం
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి

పండుగల వేళ పరేషాన్….స్కామర్ల కొత్త స్కీంతో … స్కాం లకు తెరలేపారు…అమాయకులే టార్గెట్ గా… వాట్సాప్ లో స్పీడ్ గా షేర్ అవుతున్న ఫేక్ మెసేజ్లతో పరేషాన్ చేస్తున్నారు…. పుసుక్కున పైసల వస్తాయని ఆశపడితే ఆగం అయిపోతారు. ఖాతా కాళీ అవుతుంది.
మొదట ఇది నకిలీ అనుకున్నాను, కానీ నిజంగా నాకు ₹5,000 వచ్చింది! మీరు కూడా ప్రయత్నించి చూడండి! అంటూ పండుగ రోజున వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతుంది.

పండుగ సమయంలో వాట్సాప్ ద్వారా స్కాం మెసేజెస్ ఊపందుకుంటున్నాయి. గతంలోలాగా కాకుండా…. అందరు నమ్మెట్టుగా…మెస్సేజ్ లు పెట్టి తెలివిగా స్కామ్ లో ఇటుక్కునేలా చేస్తున్నారు..
“మీకు ₹5,000 వచ్చాయి”అనే తరహా సందేశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.ఈ మెసేజెస్ పండుగపూట వాట్సాప్ ల్లో విస్తృతంగా ఫార్వర్డ్ అవుతున్నాయి.

తెలియని లింక్‌పై క్లిక్ చేస్తే డబ్బు వస్తుందని నమ్మించే ప్రయత్నం జరుగుతోందిని. ఇది పూర్తిగా సైబర్ మోసమేనని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఫోన్‌లో హానికర సాఫ్ట్‌వేర్ ప్రవేశిస్తుందని, దీంతో బ్యాంక్ ఖాతాలు, యూపీఐ యాప్‌లు ప్రమాదంలో పడుతున్నాయని సమాచారం. ఇప్పటికే పలువురు బాధితులు తమ ఖాతాల నుంచి డబ్బులు పోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెపుతున్నారు.
ఈ నేపథ్యంలో స్థానిక సైబర్ పోలీసులు ప్రజలకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి లింక్స్ వస్తె వాట్సప్ కి రిపోర్ట్ కొట్టాలని, వెంటనే ఆ massages ను డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. మీ వాట్సప్ గ్రూప్ లో వస్తున్న ఫేక్ మెసేజ్ పై మీ గ్రూప్ సభ్యులను అలెర్ట్ చేయాలనీ చెపుతున్నారు.

