49వ వార్డ్ కార్పోరేటర్ ఎన్నం లక్ష్మీ-ప్రకాష్‌లకు సన్మానం


జీ న్యూస్ కరీంనగర్
ఇటీవల జరిగిన కార్పోరేషన్ ఎన్నికలలో 49వ వార్డ్ కార్పోరేటర్‌గా గెలిచిన ఎన్నం లక్ష్మీ ప్రకాష్ దంపతులను ఆదివారం ఎస్ఈఎస్ డిగ్రీ కళాశాల సహ విద్యార్థులు, మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు శాలువాతో ఎన్నం లక్ష్మీ ప్రకాష్ దంపతులను సన్మానించారు. వారు మాట్లాడుతూ ఎన్నం లక్ష్మీ ప్రకాష్ ఎంతో కాలంగా రాజకీయాలలో రానిస్తున్నాడన్నారు. రాజకీయాలకు అతీతంగా పేదవారికి తనకు తోచిన విదంగా సాయం అందిస్తూ తన సహాదయాన్ని చాటుకున్నాడన్నారు. రానున్న కాలంలో మరింత ఉన్నతంగా ఎదగాలని, ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మిత్రులు షహజాద్ హుస్సేన్, నదీం, గుర్రం శ్రీనివాస్, అమర్, కండెం శ్రీదర్, రాజి రెడ్డి, శ్రీదర్ రెడ్డి, ముని ప్రసాద్, రేగురి లక్ష్మణ్, చంద్రశేఖర్ రెడ్డి, ఉప్పు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


