జాగృతిలో చెరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
జీన్యూస్ కరీంనగర్
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం కరింనగర్ జాగృతి కార్యాలయంలో కాంగ్రెస్ను వీడి జాగృతిలో చేరినట్లు జాగృతి జిల్లా అద్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. జాగృతి కార్యాలయంలో కరీంనగర్ మండల ఇంచార్జ్ జంగ అపర్ణ సాగర్ ల ఆధ్వర్యంలో కరీంనగర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమాగ్రి అంజనేయులు, దాసరి అంజలి, పుల్లురి శ్యామల, కారుపాకల శ్రీలత, బీస లక్ష్మీలు జాగృతిలో చేరారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ వారికి జాగృతి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ జాగృతి అధినేత్రి కవితక్క నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యల మీద పోరాటం కొనసాగుతుందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా జాగృతి పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని, ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయిన కారణంగా ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని విడి జాగృతిలో చేరుతున్నారన్నారు. రానున్న కాలంలో అన్ని పార్టీల నుండి జాగృతిలో చేరికలు ఉంటాయని, 2029లో తెలంగాణ రాష్ట్రానికి కవితక్క నాయకత్వం వహించడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాగృతి ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, చంటి శ్రీనివాస్, అధివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, యువజన నాయకులు రాజ్ కుమార్, బసవేణి రాజేందర్ తదితరులు ఉన్నారు.
