సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు..
రేవంత్ పై స్టేషన్ లో పిర్యాదు…
జీ న్యూస్ సరూర్ నగర్
సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా, హిందువుల మనో భావాలను దెబ్బ తినే విధంగా మాట్లాడితే సహించేది లేదని సరూర్నగర్ కార్పొరేటర్ శ్రీవాణి అన్నారు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి పై ఆమె బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళ పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి మెప్పు కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చెప్పాలన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని సామాన్యులకైనా..ముఖ్యమంత్రి కైనా ఒకటే చట్టం వర్తిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. హిందూ మనోభావాలను గాయపరిచేలా మాట్లాడిన రాజకీయ నాయకులు ఎక్కడ ఉన్నారో గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే హిందువుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత ప్రభుత్వ అధికారులదని ఈ విషయంలో తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరామన్నారు. కార్యక్రమంలోసరూర్నగర్ బీజేపీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,సీనియర్ నాయకులు కబీర్ దాస్, గోవర్ధన్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
