బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కు సన్మానం
జీ న్యూస్ వేములవాడ
మున్నూరు కాపు పటేల్స్ నిర్వహించిన మూడు రోజుల క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా వచ్చిన బిగ్బాస్ ఫేం గంగవ్వను ఆదివారం బీసీ సాధికారిత సంఘం సన్మానం చేశారు. ఈ సందర్బంగా వారు పులగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడూతూ గంగవ్వ గ్రామీన స్థాయి నుండి యూట్యూబ్లో పేరు తెచ్చుకున్నారన్నారు. అనంతరం బుల్లితెరకు, తరువాత వెండితెరకు వెల్లి సత్తా చాటిందన్నారు. సన్మాన కార్యక్రమంలో బీసీ సాదికారిత సంఘం నాయకులు పొలాస నరేందర్, ఇల్లందుల వెంకటేష్, చింతలకొటీ రామస్వామి, కత్రోజు ప్రభాకర్, కోరుధాల తిరుపతి, తూం రాజు, జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

