రోడ్డు పనులు చేపట్టాలని.. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా

Must read

జీ న్యూస్​ కరీంనగర్, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ నుండి పోరండ్ల వరకు రోడ్డు పనులు పూర్తి చేయలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. రహదారిపై బయటయించి  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు  నిరసన తెలిపారు. అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ, తిమ్మాపూర్ నుండి పోరండ్లకు రోడ్డు పనుల కోసం రెండు కోట్ల నిదులు గత BRS ప్రభుత్వం లో మంజూరు అయి టెండర్ పూర్తి ఆయి కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా రోడ్డు పనులను చేపట్టడం లేదని ఆరోపించారు. పాత రోడ్డు ఆద్వాన్నంగా ఉండి గుంతలలో నీరు నిలిచి ఉండడం వల్ల వాహనదారులు, ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమౌతున్నారని, ఇబ్బందులు పడుతున్నారన్నారు.  ప్రభుత్వం వెంటనే పనులను మొదలుపెట్టాలని లేని పక్షంలో కోర్ట్ ద్వార పోరాటం చేస్తామని హెచ్చరించారు. నిరనస కార్యక్రమం కారణంగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న  పోలీసులు అక్కడికి చేరుకోని రోడ్డుపై  బయటయించిన నాయకులకు నచ్చచెప్పి వారిని ప్రక్కకు పండి ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు. ఈ కార్యక్రమం లో అఖిలపక్షాల నాయకులు మాతంగి అశోక్, మాతంగి మల్లయ్య, గుర్రం సత్యనారాయణ, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రావుల రామేష్ , ఉల్లేందుల ఏకానందం, జగదీశ్వరా చారి, ఎడ్ల జోగిరెడ్డి, నగునురి బాబు,   వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

More articles

Latest article