*బండి సంజయ్ సభకు అనుమతి రద్దు*
జీ న్యూస్ హైదరాబాద్
హైదరాబాద్ బోరబండలో గురువారం జరగాల్సిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. .సభకు పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. బిజేపీ శ్రేణులు బోరబండకు తరలిరావాలని బీజేపీ నాయకుల పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన సభ జరిపి తీరుతామని బీజేపీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఇంచార్జి ధర్మారావ ధర్మారావు అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటమి పట్టుకుందని అందుకే సంజయ్ సభను అడ్డుకుందని విమర్శించారు. రెండున్నర సంవత్సరాల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ప్రజల్లో దిగజారిపోయిందని అన్నారు
