5 రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసు ను చేదించిన పోలీసులు
జీ న్యూస్ నర్సంపేట
5 రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసు ను చేదించిన పోలీసులు…
నర్సంపేట లోని కుమ్మరికుంట మరియు ద్వారకపేట రోడ్ లో నివాసం ఉంటున్న 14 సం, లు, 12 సం,, ల వయసు గల ఇద్దరు బాలురు చదువు పై ఆసక్తి చూపక ఇంటి వద్ద ఉంటూ వారి చిన్న చిన్న అవసరాలకు డబ్బులు అవసరం ఏర్పడి దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఇటీవల తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసు అధికారులు వీటిపై సీరియస్ గా తీసుకన్నారు. సిసి కెమెరా ల సహాయంతో ఇట్టి బాలురను పట్టుకోవడం జరిగింది. ఇందులో 14 సం,, ల బాలుడు ఇంతకు ముందు గవర్నమెంట్ హాస్పిటల్ లో మొబైల్ దొంగతనం మరియు అంగడి రోడ్ లో ఒక ఇంట్లో దొంగతనం చేసి ఉన్నాడు. వీరువూరి వద్ద నుండి 2 తులల బంగారం, 4000 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సంపేట ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ తల్లితండ్రులు తమ పిల్లల పట్ల తగు శ్రద్ధ తీసుకోవాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలని , వారి ఆలోచన సరళిని అంచనా వేసి చెడు మార్గంలో వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రతి ఒక్కరు సి సి కెమెరా లు మార్చుకోవాలని, సి సి కెమెరా ల వల్ల నేరాలు నియంత్రించబడతాయి అని సూచించారు.
