అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి  

Must read

అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి  

జీ న్యూస్ నర్సంపేట 

మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశించారు.

బుధ, గురువారలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్ర గాలులు వీస్తాయని, వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

విద్యుత్,త్రాగునీరు, అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్లు,చెరువులు మరియు కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మత్తులు చేయాలన్నారు.  శిథిలావస్థ ఇళ్ళు,భవనాలలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే వారిని పునరావస్థ కేంద్రాలు తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.  ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే పోలీసులకు , అధికారులకు సమాచారం అందించాలని,  అధికార యంత్రంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article