ఆకట్టుకున్న నాగార్జున డైరీ ఆటల పోటీలు

Must read

ఆకట్టుకున్న నాగార్జున డైరీ ఆటల పోటీలు

ఉత్సాహంగా పాల్గొన్న సిబ్బంది

జీ న్యూస్​ హుజూరాబాద్​

క్రీడలు శారీరక మానసిక ధృడత్వానికి దోహదం చేస్తాయని నాగార్జున డైరీ చైర్మన్​ పుల్లూరి ప్రభాకర్​ రావు అన్నారు. బుదవారం రిపబ్లిక్​ డే క్రీడోత్సవాలను స్థానిక క్రీడా మైదానంలో ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక బలానికి మార్గం, శారీరక దఢత్వానికి పునాది అన్నారు. క్రీడలు మన జీవితంలో కేవలం వినోదం మాత్రమే కాదు, నిబద్ధత, జట్టుగా పని చేయడం, మానసిక స్థైర్యం వంటి విలువల్ని నేర్పించే సాధనం అన్నారు. నిత్యం విదులలో నిమగ్నమయ్యే సిబ్బంది, క్రీడాకారులుగా ఉత్సాహంగా పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. ఆసక్తిగల క్రీడలలో ఉత్సాహంగా పాల్గొని, పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పూర్తి స్థాయి క్రీడాకారుల మాదిరి ఉత్సాహంగా, పాల్గొని క్రీడా స్పూర్తని చాటరన్నారు.

రిపబ్లిక్​ డే ను పురస్కరించుకొని నాగార్జున డైరీ సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించారు. క్రికెట్​, టగ్​ ఆఫ్​ వార్​, రన్నింగ్​, షాట్ పుట్​, మహిళా సిబ్బందికి ముగ్గుల పోటీలు, చెంచా పరుగు, సూదిలో దారం, మ్యూజికల్​ చైర్​, మగ్గుల పోటీలు తదితర అంశాలపై ఆటల పోటీలు నిర్వహించారు. వీటిలో బాగంగా నిర్వహించిన క్రికెట్​ పోటీలు ఆద్యంతం పోటా పోటీగా సాగాయి. టగ్ ఆఫ్​ వార్​ పోటీలొ ఉత్సాహంగా పాల్గొన్న సిబ్బందిని చూసిన స్థానికులు సైతం భారీ సంఖ్యలో చేరుకొని వారిని ఉత్సాహ పరిచారు. డైరీ డైరెక్టర్​ పుల్లూరి గణేష్ రావు, సీఈఓ కృష్ణ ప్రసాద్​, ఏజీఎం సుధాకర్​, మేనేజర్లు ప్రత్యక్షంగా పోటీలలో పాల్గొని సిబ్బందిని ఉత్సాహ పరిచారు. నాయకులు బండ శ్రీనివాస్, వర్దినేని రవీందర్ రావు, తాళ్లపల్లి శ్రీనివాస్ , ఆర్​కె రమేష్​, బత్తుల సమ్మయ్య, కిరణ్​ కుమర్​ తదితరులు క్రీడలను ప్రారంభించి, తిలకించి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు.

More articles

Latest article