ప్రజారోగ్య పరిరక్షణలో గ్రామ పాలకవర్గం క్రియాశీలక పాత్ర పోషించాలి.

Must read

ప్రజారోగ్య పరిరక్షణలో గ్రామ పాలకవర్గం క్రియాశీలక పాత్ర పోషించాలి.

నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం.

జీ న్యూస్ హుజురాబాద్:

హుజురాబాద్ మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లను కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్స్ అధినేత డా. కూరపాటి రమేష్, . డా కూరపాటి రాధిక లు   అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన ప్రజాప్రతినిధులను సన్మానించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డా. కూరపాటి రమేష్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సేవా భావంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు గ్రామస్థాయిలో విస్తరించేందుకు కూరపాటి ఫౌండేషన్, కూరపాటి హాస్పిటల్స్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

More articles

Latest article