జాగృతి రాజకీయ పార్టీల అధ్యయన కమిటీలో హరిప్రసాద్
జీ న్యూస్ కరీంనగర్
తెలంగాణ జాగృతి రాజకీయ వ్యవహారాల అధ్యయన కమిటీలో సభ్యుడిగా నియమించినందుకు కరీంనగర్ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతి నూతన రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో పలు అంశాలకు సంబందించి కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు, అమలు పరిచిన విధానాలు, ఇచ్చిన హామీలు, అమలు పనితీరు మీద అధ్యయనం చేయడానికి కమిటీని వేశారు. ఐదుగురు రాష్ట్రస్థాయి నాయకులతో పాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆ కమిటీలో సభ్యుడిగా నియమించారన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా బిసి ఉద్యమాన్ని బలోపేతం చేయడం, బిఆర్ఎస్ పార్టీని వదిలి కవిత వెంటే ఉన్నానన్నారు. మొదటినుండి కవితకు కరీంనగర్ జిల్లాలో నమ్మకస్తుడిగా, బహుజన నాయకుడిగా కవితకు అత్యంత విధేయుడిగా ఉన్న తనను రాజకీయ పార్టీల పని విధానం మీద అధ్యయనం చేయనున్న కమిటీలోకి తీసుకోవటం ఆనందంగా ఉదన్నారు. కవిత నాయకత్వంలో రాష్ట్రంలో సామాజిక తెలంగాణ సాధన ధ్యేయంగా, బడుగు బలహీన వర్గాల నాయకులను కలుపుకుని కార్యాచరన ఉంటుందన్నారు. గుంజపడుగు హరిప్రసాద్ కు సముచిత స్థానం కల్పించడం పట్ల కరీంనగర్ జిల్లా జాగృతి పలువురు నాయకులు అధ్యక్షురాలు కవిత కు ధన్యవాదాలు తెలియజేశారు.
జాగృతి రాజకీయ పార్టీల అధ్యయన కమిటీలో హరిప్రసాద్
