డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన నిజ నిర్ధారణ కమిటీ నాయకులు.

Must read

డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన నిజ నిర్ధారణ కమిటీ నాయకులు.

జీ న్యూస్,హుజూరాబాద్:

హుజురాబాద్ పట్టణ శివారులోని గణేష్ నగర్ గుట్టల ప్రాంతంలో ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్ స్థలాన్ని సోమవారం నిజనిర్ధారణ కమిటీ నాయకులు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయ సంకల్పించిన స్థలమును పరిశీలించి పరిసర ప్రాంతాల ప్రజలను తో మాట్లాడారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ఎలాంటి పరిస్థితులు రానున్నాయో వారు పలువురు రైతులను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల జరిగే నష్టాలను గురించి కూలంకషంగా చర్చించి అధికారులకు నివేదిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నిజనిర్ధారణ కమిటీ నాయకులు జెఎసి చైర్మన్ ఆవునూరు సమ్మయ్య, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, పి ఈశ్వర్ రెడ్డి, బి సి ప్రజాస్వామిక ఉద్యమ వేదిక నాయకులు భీమోజు సదానందం సాదుల రవీందర్, పొడి శెట్టి వెంకటరాజo, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఎండి ఖాళీదు హుస్సేన్, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article