జిల్లా స్థాయి ప్రతిభా పరీక్షలో మెరిసిన భైంసా వాసవి విద్యార్థి
జి న్యూస్ బైంసా
లెక్కల మాంత్రికుడు రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి గణిత ప్రతిభ పరీక్షలో బైంసా విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. పట్టణములోని వాసవి హైస్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న జాధవ్ శ్లోకేష్ రావు ఐఐటి స్థాయిలో నిర్వహించిన ప్రతిభ పరీక్షలో పాల్గొని ప్రతిభ కనబర్చి తృతీయ స్థానంలో నిలిచాడు. ఆల్ ఫోర్స్ అధినేత వీ నరేందర్ రెడ్డి చేతులమీదుగా ప్రశంసా పత్రం తో పాటు రూ 2000 బహుమతి అందుకున్నాడు. శ్లోకేష్ రావుకు గాంధీ బాలా సేవా సంఘం అధ్యక్షులు జాదవ్ పుండలిక్ రావు, ఆరె మరాఠా సంఘం నాయకులు రఘువీర్ పటేల్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
