సమస్యలు పరిష్కారించాలంటూ ఆశ కార్యకర్తల ఆందోళన

Must read

సమస్యలు పరిష్కరించాలంటూ …ఆశ కార్యకర్తల ఆందోళన

జీ న్యూస్​ హుజూరాబాద్​

పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు మంగళవారం ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన లెప్రసీ బిల్లులు, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు, పల్స్ పోలియో బకాయిలు మూడేళ్లు గడుస్తున్నా చెల్లించలేదని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల వేలాది మంది కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నెలకు రూ. 18,000 ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని కోరారు. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న 6 నెలల ఏరియర్స్ చెల్లించాలని, 5 లక్షల ప్రమాద బీమా, పి ఎఫ్, ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఏడాదికి 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.​ కేవలం గర్భవతుల నమోదు, టీకాల వంటి కొన్ని పనులకే అరకొర పారితోషికం ఇస్తూ, మిగిలిన పనులన్నీ ఉచితంగా చేయించుకుంటూ అధికారులు తమను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు ఇచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ తులసి దాస్‌కు అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు లత, సుజాత, మాదీనా, ఉమా, విజయలక్ష్మి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More articles

Latest article